Ex presidents presidents defeat

Former-Presidents PCC Presidents defeat, Election 2014, Assembly elections, PCC, ponnala lakshaiah, D.srinivas, Botsa Sathyanarayana, raghuveera reddy,

Former-Presidents PCC Presidents defeat, Election 2014, Assembly elections, PCC, ponnala lakshaiah, D.srinivas, Botsa Sathyanarayana, raghuveera reddy,

కొత్త (పాత) పీసీసీలను చితక్కిట్టిన ఓటర్లు

Posted: 05/16/2014 03:40 PM IST
Ex presidents presidents defeat

నేడు దేశవ్యాప్తంగా వెలువడుతున్న సార్వత్రికల ఎన్నికల ఫలితాల్లో చాలా మంది హేమా హేమీలకు ఎదురు దెబ్బతగిలింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకులను ఓటర్లు చావుదెబ్బ తీశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పనిచేసిన మాజీ, ప్రస్తుత పీసీసీ అధ్యక్షులు అందరు ఓడిపోవడం విశేషం. ఏపి మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రులు ఓడిపోయారు. పిసిసి మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, బొత్స సత్యనారాయణలకు ఓటర్లు తగిన శాస్తి చేశారు. ఇక కొత్త రాష్ట్రంలో ఎంతో గర్వంగా పీసీసీ పదవులు చేపట్టిన పొన్నాల, రఘువీరా ఘోర పరాజయం పాలయ్యారు.

నిజామాబాద్ రూరల్ శాసనసభ స్థానంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి శ్రీనివాస్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్థి బాజీరెడ్డి గోవర్థన్పై 20 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.  తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య  వరంగల్ జిల్లా జనగామ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విజయం సాధించారు. మరో పిసిసి మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో ఓడిపోయారు. ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అనంతపురం జిల్లా పెనుకొండలో పోటీ చేసి ఓడిపోయారు.

ఇక్కడ  టిడిపి అభ్యర్థి పార్ధసారధి విజయం సాధించారు. రఘువీరా రెడ్డి మూడవ స్థానానికి వెళ్లారు. ఈ ఓటమి భారంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ ఓటమితో ఇటు తెలంగాణలో, ఆటు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ చావు దెబ్బ తిన్నట్లయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles